Manjula Ghattamaneni script for pawan kalyanప్రిన్స్ మహేష్ బాబు సోదరిమణి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ ఈ నెల 16వ తేదీన విడుదల కానున్న సందర్భంలో ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో… తాను పవన్ కళ్యాణ్ కోసం ఓ కధ రాసుకున్నానని, పవన్ గనుక వింటే ఇది ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతారని, ఆయనకు మీరైనా చెప్పండి అంటూ మీడియా వర్గాలను చమత్కరించిన మంజుల, తాజాగా ఆ కధ ఇతివృత్తంను వివరించారు.

“సినిమా ఇండస్ట్రీలో టాప్ స్థాయిలో ఉన్న ఓ హీరో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాడన్న అంశంపై కధ రాసుకున్నట్లుగా” మంజుల తెలిపారు. ఈ కధ పవన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, తనకు అవకాశం లభిస్తే ఆయనతో ఈ సినిమా తీస్తానని అన్నారు. పవన్ ఇప్పట్లో సినిమాలు చేయరని తెలిసి కూడా మంజుల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే… పబ్లిసిటీ స్టంట్ కాదు కదా..! అనుకోవడం పాఠకుల వంతవుతోంది.