manikarnika-teaser-talk-typical-krish-but-louder-and-with-gpsk-hangoverఅనేక వివాదాల నడుమ షూటింగ్ జరుపుకున్న కంగనా రనౌత్ – క్రిష్ ల “మణికర్ణిక” సినిమా తొలి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఎలా ఉంది? అన్న దాని కంటే ముందు, ఈ సినిమా డైరెక్టర్ పేరు స్థానంలో ఎవరి పేరు ఉంటుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న నేపధ్యంలో… తొలి టీజర్ ఈ ప్రశ్నకు బదులిచ్చింది.

మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాను కంగనా రీషూట్ చేసుకుని, డైరెక్టర్ గా తన పేరు వేయించుకుంటుందన్న ప్రచారం అవాస్తవమని తేలింది. డైరెక్టర్ స్థానంలో మన క్రిష్ పేరే ఉండగా, ‘బాహుబలి, భాజరంగే బాయిజాన్’ సినిమాల రచయిత విజయేంద్రప్రసాద్ ఈ “మణికర్ణిక”కు కధ అందించారు.

ఇక టీజర్ విషయానికి వస్తే… పోరాట సన్నివేశాలతో టీజర్ ను పూర్తిగా నింపేసారు. ఝాన్సీలక్ష్మీభాయ్ పాత్రలో కంగనా పర్ ఫెక్ట్ గా సూట్ అయినట్లు కనిపించింది. అలాగే యుద్ధసన్నివేశాలు కూడా బాగా వచ్చాయన్న అనుభూతిని ఈ టీజర్ కలిగించింది. వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.