Mani-Sharmaఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన సంగీత దర్శకుడిగా మణిశర్మకు ఎనలేని ఖ్యాతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే మణి, మణి అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్న రీతిలో పేరు గడించిన మణిశర్మకు తాజాగా పితృవియోగం కలిగింది. 92 సంవత్సరాల వయసు కలిగిన మణి తండ్రి యనమండ్ర నాగయజ్ఞశర్మ మంగళవారం ఉదయం ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

వయోలిన్ విధ్వాంసుడిగా నాగయజ్ఞ శర్మకు మంచి గుర్తింపు ఉంది. అలా సంగీత కుటుంబం నుండి వచ్చిన మణి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావడంలో ఆయన తండ్రి గారి పాత్ర చిరస్మరణీయం. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు మణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.