Mandarin Chinese, Mandarin Chinese Tops English, Mandarin Chinese Tops American English, Mandarin Chinese Tops British English, Mandarin Chinese Tops World  Englishప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది అంటే… ‘ఇంగ్లీష్’ అని టక్కున సమాధానం చెప్పేస్తారు చాలామంది. ఇదే చెప్తే ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇంగ్లీష్ కాదు, చైనీయులు మాట్లాడే మాండరీన్ అని తేలింది. ప్రపంచ జనాభాలో సగమున్న చైనా, తైవాన్, హాంగ్ కాంగ్, మలేసియా దేశాలతో పాటు 100 కోట్ల మంది మాండరీన్ (చైనా భాష) మాట్లాడుతారని సదరు నివేదిక స్పష్టం చేసింది.

ఇక, మాండరీన్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషగా స్పానిష్ రెండో స్థానంలో ఉంది. 35 దేశాల్లో 33.90 కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలన కారణంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇంగ్లీషు భాషను 110 దేశాల ప్రజలు మాట్లాడతారు. జనాభా పరంగా ఇంగ్లిష్ ను 33.50 కోట్ల మంది ప్రజలు మాతృభాషగా మాట్లాడితే, అందులో 22.50 కోట్ల మంది అమెరికన్లే ఉన్నారు. దీంతో ఈ విషయంలో ఇంగ్లీషు భాష మూడో స్థానం ఆక్రమించింది.

ఇక, ఆ తర్వాత స్థానాన్ని అరబిక్ సొంతం చేసుకుంది. ప్రపంచంలోని 60 దేశాల్లో 24.20 కోట్ల మంది ప్రజలు ఈ భాష మాట్లాడుతారు. ఏడో శతాబ్దంలో ముస్లిం పాలకుల సామ్రాజ్యాల విస్తరణ కారణంగా ఈ భాష కూడా విస్తరించింది. అయితే, నేడు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు నేర్చుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 150 కోట్ల మంది విద్యార్థులు ఇంగ్లీషు భాషను అభ్యసిస్తుండగా, 12.60 కోట్ల మంది విద్యార్థులు ఫ్రెంచ్, చైనా, స్పానిష్ భాషలను అభ్యసిస్తున్నారని, సరైన గణాంకాలతో కూడిన నివేదికను ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వెల్లడించింది.