Manchu Vishnu Wife Delivery live on instagramమంచు విష్ణు సతీమణి వినూ ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. తమ మూడవ బిడ్డను వారు స్వాగతించడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో విష్ణు చేసిన ఒక ట్వీట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాసేపటిక్రితం విష్ణు ట్విట్టర్ లో తన భార్య డెలివరీని ఇంస్టాగ్రామ్ లో లైవ్ ఇవ్వబోతున్నా అని ప్రకటించాడు. అంతటితో ఆగలేదు కాజల్ అగర్వాల్ తో ఈ విషయంపై బాగా చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నా అని, ఈ ఐడియా ఇచ్చినందుకు ఆమెకు థాంక్స్ కూడా చెప్పాడు.

దీనిపై నెటిజెన్లు కామెంట్లు విసురుతున్నారు. అసలు ప్రసవం లైవ్ ఇవ్వడం ఏంటో, దానికి కాజల్ అగర్వాల్ తో డిస్కషన్ ఏంటో అని వారు తలలు పట్టుకుంటున్నారు. కొందరైతే ఈ ఐడియాను తిడుతున్నారు కూడా… కొందరు మీ సినిమాల్లాగే ఈ ఐడియా కూడా ఉంది అంటూ సెటైర్లు విసురుతున్నారు. మరి విష్ణు ఏ అభిప్రాయంతో ఈ పనికి పూనుకున్నాడో. విష్ణు తదుపరి చిత్రం కన్నప్పలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది. ఆ రకంగా వీరి మధ్య స్నేహం మొదలైనట్టు ఉంది.

2018లో వచ్చిన ఆచారి అమెరికా యాత్ర తరువాత విష్ణు తన తదుపరి చిత్రం ఏదీ మొదలు పెట్టలేదు. ఎప్పటి నుండో రిలీజ్ కు నోచుకోని ఓటర్ సినిమా ఆ మధ్య విడుదల అయ్యింది. దర్శకనిర్మాతలతో ఉన్న విబేధాల కారణంగా విష్ణు ఈ సినిమా ప్రొమోషనలకు దూరంగా ఉన్నాడు. సినిమా విడుదలపై స్టే కు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మొదటి రోజే చాలా చోట్ల సినిమా తీసేశారు. దీనితో విష్ణు కన్నప్పతో పెద్ద హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.