Manchu Vishnu was elected as MAA Presidentనెల రోజులుగా హోరాహోరీగా ప్రచారం చేసిన అనంతరం… మా ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ మీద భారీ మెజారిటీ తో గెలుపొందారు ఆయన.

చిరంజీవి బయటకు వచ్చి ఎవరికీ మద్దతు ఇవ్వకపోయినా ఆయన తరపున నాగబాబు వీరోచితంగా.. వీరావేశంగా మీడియా ముందు ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు అన్నయ్య పరువు తీశారు.

ఇప్పుడు ఏకంగా మెగా హీరోలకే గెలవడం రాదు.. ఇంక వేరొకరిని ఏం గెలిపిస్తారు అని మాట అనిపించుకున్నారు. అవన్నీ పక్కన పెడితే అసలు ఎలెక్షనీరింగ్ అనేది తెలుసా అన్నట్టుగానే సాగింది ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓటింగ్ రోజు వ్యవహారం.

వేరే చోట్ల స్థిరపడిన వారికి కనీసం 100 మందికి విష్ణు ఫ్లైట్ టిక్కెట్లు వేసి ఓట్లు వేయించుకున్నారు. వారికోసం ఇరవై కార్లు, హోటల్ రూములు, తిరుగు ప్రయాణం ఏర్పాట్లు చేశారు.

ఎప్పుడో 2012లో చివరిసారిగా తెలుగులో నటించిన జెనీలియాని కూడా ‘ఢీ’ సెంటిమెంట్ తో హైదరాబాద్ రప్పించేశాడు విష్ణు. ఇక పోలింగ్ స్టేషన్ దగ్గర హడావిడి చూస్తే విష్ణు గాలి వీస్తుంది అన్నట్టే ఉంది. ప్రకాష్ రాజ్ కు సంబంధించిన బ్యానర్లు కూడా సరిగ్గా లేకపోవడం విషాదం.

ఇక ఓటర్లను రప్పించడానికి విష్ణు అంత ప్రయత్నం చేస్తే… కనీసం మెగా ఫ్యామిలీ లోని అంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోకపోవడం విషాదం. అంత హడావిడి చేసిన నాగబాబు కనీసం ఆయన కుమారుడు, కుమార్తెను కూడా ఓటింగుకు తీసుకురాకపోవడం గమనార్హం.

ఒకరకంగా విష్ణు కసి ముందు మెగా ఢీలా పడిపోయింది అనే చెప్పుకోవాలి.