వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో దర్శకుడు శ్రీనువైట్లకు కోలుకోలేని దెబ్బ తలిగింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని తెరకెక్కించిన ‘బ్రూస్లీ’ చిత్రం ఫలితం తారు మారు అవ్వడంతో శ్రీనువైట్ల గ్రాఫ్ పడిపోయింది. ఈయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ముందుకు వచ్చే ఛాన్స్ లేదు. దాంతో ఈయన చిన్న హీరోలతో మళ్లీ సినిమాలు చేసి, సక్సెస్ కొట్టి తన సత్తాను చాటుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు. తాజాగా ఈయన యువ హీరో రామ్‌తో తన తర్వాత సినిమా చేసే అవకాశాలున్నాయనే వార్తలు వచ్చాయి.
మరో వైపు మంచు హీరో విష్ణు సైతం శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నాడు. చాలా కాలం క్రితం వీరిద్దరి కాంబినేషన్లో ‘ఢీ’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని విష్ణు ఆశిస్తున్నాడు. శ్రీనువైట్ల ప్రస్తుతం ఫ్లాప్‌లలో ఉన్న నేపథ్యంలో విష్ణు ఆయనతో సినిమా చేయాలని భావిస్తున్నాడు. తాజాగా శ్రీనువైట్లతో మంచు విష్ణు సంప్రదింపులు కూడా జరిపాడని, వీలుంటే ‘ఢీ’కు సీక్వెల్‌గా కథను రెడీ చేయాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది. మంచు విష్ణు ప్రపోజల్‌ను శ్రీనువైట్ల పరిశీలిస్తాను అన్నాడట. అయితే రామ్‌తో అనుకున్న సినిమాను పక్కకు పెట్టి విష్ణుతో శ్రీనువైట్ల సినిమా చేస్తాడా అనేది చూడాలి.