Manchu Vishnu meeting YS Jagan Mohan Reddyఅసలు మీడియా మీట్ కు నేను పిలవలేదు, మీకు ఎవరైతే చెప్పారో వారిని అడగండి, అంటూ జగన్ ను కలిసిన తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్ లేదని మంచు విష్ణు తెలుపగా, ఆ తర్వాత విలేఖరులు విజ్ఞప్తి చేయడంతో కాసేపు ముచ్చటించారు మంచు విష్ణు.

ఇటీవల జగన్ తో చిరంజీవి బృందం సమావేశానికి మోహన్ బాబుకు కూడా ఆహ్వానం పంపించారని, కానీ ఆ సమాచారం నాన్న గారికి చేరనివ్వకుండా కొంతమంది అడ్డుకున్నారు, వారెవరో కూడా నాకు తెలుసు, కానీ ఎవరనేది ఇప్పుడేమి నేను చెప్పను.

నాన్న గారిని ప్రభుత్వం ఆహ్వానించలేదు అని చెప్పడంలో నిజం లేదు, ఎందుకంటే నాన్న గారు ఓ సీనియర్ నటులు, లెజెండరీ యాక్టర్, ఎవరు దీనిని క్యారీ ఫార్వార్డ్ చేసారో, ఎవరు అవాయిడ్ చేసారో నాకు తెలుసు, త్వరలో మేము కనుక్కుని, ఎలా కనెక్ట్ చేయాలనేది చూస్తాం.

ఇండస్ట్రీ అంతా ఒకటే కుటుంబం, మాలో మాకు చాలా ఉంటాయి, అవన్నీ ఇక్కడ చెప్పను, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఖచ్చితంగా చర్చలు జరుపుతామని, నా ద్వారా ఇండస్ట్రీలో ఎలాంటి విభేదాలకు ఆస్కారం ఇచ్చే విధంగా మాట్లాడను.

ఇది పూర్తిగా తన వ్యక్తిగత భేటీ అని, అన్నా-వదినలతో భోజనం చేయడానికి మాత్రమే వచ్చానని, ఎన్నో మాట్లాడుకున్నాము, ఇందులో సినిమా రంగం గురించి కూడా మాట్లాడుకున్నామని, అవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత చెప్తానని అన్నారు.

ఖచ్చితంగా తిరుపతిలో సినిమా స్టూడియో కడతాను, ఇప్పుడు వచ్చింది ఆ పని మీద కాదు, ఈ విషయంపై ప్రభుత్వ సహకారం కోసం మళ్ళీ వస్తాను, శ్రీవిద్యానికేతన్ స్థాపించిన 30 ఏళ్ళ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ అయ్యింది, వాటి గురించి తర్వాత వివరిస్తాను.

ఇటీవల తాను పేర్ని నానిని కలిసినపుడు ఓ మీడియా వర్గం దీనిని మరో రకంగా చిత్రీకరించిందని, దీనిపై నేను ఓ స్పష్టత ఇవ్వదలచుకున్నానని, నాకు వైసీపీ, టీడీపీలలో సన్నిహితులు ఉన్నారు, అందులో భాగంగా పేర్ని నాని వచ్చారు తప్ప, ఇందులో రహస్యం ఏమి లేదని చెప్పుకొచ్చారు.

2+2=4 అవుతుంది గానీ, 2+2 పక్కనే ఉన్నాయని 22 అయిపోదు, ఇది సింపుల్ అని అన్నారు. మంచు ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ‘మా’ ఎన్నికలలో ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి ‘మా’ ప్రెసిడెంట్ గా నిలబడతానా? అంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు గర్వంగా బదులిచ్చారు.

ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు లేవనెత్తిన అంశాల గురించి చెప్పాలంటే… మాట్లాడిన ప్రతి అంశంలో ‘తొలుత తాను ఏమీ చెప్పను అంటూనే ఆ అంశంపైన ప్రతిదీ చెప్పి, మళ్ళీ ముగించే దశలో ఇక్కడ తానేమీ చెప్పను, మరో వేదికపైన చెప్తాను’ అంటూ ముగించారు.