edo rakam ado rakam posterమంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాకు “ఈడోరకం ఆడోరకం” అనే టైటిల్ ను ఖరారు చేసారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఇద్దరూ చెరో వైపు పరుగెడుతూ దర్శనమిస్తున్న పోస్టర్ పై సోషల్ మీడియాలో రకరకాల సరదా కామెంట్లు పడుతున్నాయి.

హీరోలిద్దరూ చెరో వైపుకు పరిగెడుతుంటే… సినిమాను చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎటు వైపుకు పెరిగెత్తాలంటూ… చేసిన వ్యాఖ్యలు పోస్టర్ లోని సీన్ మాదిరే నవ్వులు పూయిస్తున్నాయి. అయితే ప్రేక్షకులంతా తమ సినిమా ధియేటర్ల వైపుకు పరిగెత్తాలన్నది సినిమా యూనిట్ సారాంశం కూడా కావచ్చు అని… మరో కామెంట్. సోషల్ మీడియాలో సినీ పోస్టర్స్ పై పడే ఇలాంటి కామెంట్స్ కు కొదవ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

‘దేనికైనా రెడీ’ సినిమాతో మంచు విష్ణుకు భారీ హిట్ అందించిన నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ‘బిందాస్’ సినిమాతో మంచు మనోజ్ కు భారీ విజయాన్ని అందించిన అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మంచు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.