manchu manoj with Jr NTR's-son-Abhay Ram‘తన ఇంటికి వచ్చిన స్నేహితులను, ఆత్మీయులను, బంధువులను జూనియర్ ఎన్టీఆర్ ఎంతో గౌరవంగా చూసుకుంటారు’ అన్న విషయం ఇండస్ట్రీ వర్గాలకు సుపరిచితమే. బహుశా ఆ నందమూరి వంశంలో ఉన్న వారసత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడేమో గానీ, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడన్న విషయం తాజాగా స్పష్టమైంది.

టాలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో మంచు మనోజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి విచ్చేసిన సమయంలో… అభయ్ స్వయంగా ఓ గాజు గ్లాసులో మంచినీళ్ళు తీసుకువచ్చి మనోజ్ కు పట్టించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసాడు. ‘చల్లటి నీళ్ళతో నాకు స్వాగతం… తారక్ కు కరెక్ట్ మొగుడు నా బుజ్జి అభయ్ కుట్టి’ అంటూ పేర్కొన్నాడు మనోజ్.

అంతేకాదు తారక్ వారసుడు గురించి మరికొన్ని మాటలు కూడా చెప్పడంతో ‘యంగ్ టైగర్’ అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ‘తారక్ కన్నా వంద రెట్లు ఎనర్జిటిక్ గా అభయ్ ఉన్నాడని’ ప్రశంసిస్తూ పోస్ట్ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ హంగామా చేస్తోంది. అంతేలే మరి… మామూలుగా అయితే మంచు మనోజే ఇతరులకు మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు… మరి ఆయనకే ఓ గ్లాసుడు నీళ్ళు తాగించాడుగా అభయ్..!