mamata banerjee wheelchairపశ్చమ బెంగాల్ లో ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించాయి. మమతా బెనర్జీ ని గద్దె దించడానికి మోడీ, అమిత్ షాలు తమ శాయశక్తులా ప్రయత్నించారు. కోవిడ్ ని కూడా లెక్క చెయ్యకుండా సభలు, ర్యాలీలు పెట్టారు. అందుకు దేశం మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చినా పట్టించుకోలేదు. అయితే ఫలితాల రోజు మాత్రం కథ తారుమారు అయ్యింది.

మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ బెంగాల్ లో అనూహ్యం విజయం నమోదు చేస్తుంది. 292 సీట్లు గల బెంగాల్ లో 200 సీట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతుంది ఆ పార్టీ. బీజేపీ ని ఓడించటానికి ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంది మమతా. ఎన్నికల ప్రచారం సమయంలో తన మీద బీజేపీ అట్టాక్ చేసిందని మమత ఆరోపించారు.

ప్రచారం కూడా వీల్ చైర్ లో నుండే చేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కోడి కత్తి గురించి అంతా గుర్తు చేసుకున్నారు. అప్పుడు జగన్ కోసం కూడా ప్రశాంత్ కిశోరే పని చేశారు. నేతల మీద జరగని అట్టాక్ జరిగిందని… దానితో సింపతీ కోసం ట్రై చేయిస్తారని అప్పట్లో ప్రశాంత్ కిషోర్ గురించి చాలా మంది అన్నారు.

ఏది ఏమైనా రెండు సందర్భాలలోనూ ఆయా పార్టీలు గెలిచి అధికారంలోకి వచ్చాయి. ఈ ఎన్నికలలో మోడీ, అమిత్ షాలను ఢీ కొట్టి మమతను గెలిపించి ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాలలో తన పరపతిని మరింతగా పెంచుకున్నారు. ఇక ఆయన డిమాండ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.