kcr - Mamata Banerjeeతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోల్కత్త వెళ్లి మరీ కలిశారు. అయితే కేసీఆర్ చేసిన ప్రతిపాదన మమతాకు పెద్దగా నచ్చినట్టుగా లేదు. ఆమె ఈరోజు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు.

బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కు ఒకేగానీ కాంగ్రెస్ ను పక్కనపెట్టే ఉద్దేశం తనకు లేదని ఆమె చెప్పకనే చెప్పారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా అని విలేకర్లు అడిగితే ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలే మాట్లాడుకుంటారని ఆమె డైరెక్టుగానే చెప్పారు. దీనితో కేసీఆర్ కు ఆదిలోనే హంసపాదు ఎదురయినట్టు అయ్యింది.

మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మరో విడత ఢిల్లీ పయనం అవుతున్నారు కేసీఆర్. ఈ దఫా మరికొంత మంది జాతీయ నాయకులతో మాట్లాడి వారిని కూడా ఫ్రంట్ వైపు తీసుకుని రావాలని ఆయన ప్రయత్నం. చూడాలి ఈ సారి ఏమైనా మెరుగైన ఫలితాలు సాధిస్తారేమో అనేది.