MalliRaava-Teaserక్లాస్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సుమంత్, తాజాగా “మళ్ళీ రావా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ చిన్నపాటి మేకింగ్ వీడియోను విడుదల చేయగా, తాజాగా తొలి టీజర్ ను విడుదల చేసారు. చెప్పుకోవడానికి ఈ టీజర్ లో ఏం లేదు గానీ, మరో క్లాస్ సినిమాతో సుమంత్ తన దండయాత్ర చేయబోతున్నట్లుగా స్పష్టమైంది.

పదమూడేళ్ళ తర్వాత చూసిన తన ప్రేయసిని చూస్తూ సుమంత్ చెప్పే డైలాగ్స్ మాత్రమే ఉన్న టీజర్, టైటిల్ లోని ఆంతర్యం ఏమిటో చెప్పినట్లుంది. “మళ్ళీ రావా” అన్న టైటిల్ మాదిరే తన జీవితంలోకి మళ్ళీ తన ప్రేయసి వచ్చినట్లుగా చూపించిన ఈ టీజర్ వలన కొత్తగా చేకూరే ప్రయోజనం ఏమిటో చిత్ర యూనిట్ కే తెలియాలి గానీ, పెరిగిన గడ్డంతో సుమంత్ మాత్రం యధావిధిగా క్లాస్ గా కనపడుతున్నారు.