Malli-Raava-Sumanth-Naga-Chaitanyaకొంద‌రికి ఎంత బ్యాగ్రౌండ్ వున్నా హీరోగా కెరీర్ అంతంత మాత్రంగానే ఉంటుంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌ళ్ల‌లో ఒక‌డైన సుమంత్ ప‌రిస్థితి ఇదే. ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో స‌త్య‌, ఆ త‌ర‌వాత శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లో గోదావ‌రి చిత్రాలు ప‌ర‌వాలేద‌నిపించాయి. ఆ త‌రువాత చేయ‌డానికి కొన్ని సినిమాలు అయితే చేశాడు కానీ.. అవి ఎప్పుడొచ్చి వెళ్లాయో చెప్ప‌డం క‌ష్టం. గ‌త యేడాది `న‌రుడా డొన‌రుడా` అంటూ బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన `విక్కి డోన‌ర్` చిత్రాన్ని రిమేక్ చేశారు.న‌రుడా డొన‌రుడా చిత్రం తో సుమంత్ కెరీర్ కు ఒన కూడిన ప్ర‌యోజ‌నం అయితే ఏమి లేదు.

లేటెస్ట్ గా `మ‌ళ్లీ రావా` చిత్రంతో రెడీ అయ్యాడు. ఈ నెల 8న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు . ఇదిలా వుంటే..ఈ చిత్రం ట్రైల‌ర్ గురించి నాగ చైత‌న్య‌, స‌మంత ఏం చెప్పారో తెలుసా..?

నాగ చైత‌న్య అయితే ఈ చిత్రం ట్రైల‌ర్ చాల నేచుర‌ల్ గా ఉంది. కచ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌నే భ‌రోసా తో వున్నాడు. త‌ను న‌టించిన ల‌వ్ స్టోరి చిత్రాలు స‌క్సెస్ అయ్యాయి. త‌న‌కు స్వ‌త‌హాగా ల‌వ్ స్టోరి చిత్రాలు చాల ఇష్టం అని చెప్ప‌డ‌మే కాకుండా.. ఎలాగైన త‌న ఫ్యాన్స్ ను కూడా త‌న మేన బావ న‌టించిన `మ‌ళ్లీ రావా` చిత్రం చూడండి అని ప‌రోక్షంగా చెప్పాడు. ఇక స‌మంత కూడా సుమంత్ అన్న చిత్రం చూడండి అని త‌న అభిమానుల‌కు ఒక మాట చెప్పంది. మ‌ళ్లీ రావా చిత్రం ట్రైల‌ర్ చూస్తే ప్రేమ క‌థా చిత్రంగా చేసిన‌ట్లు అనిపిస్తుంది. ట్రైల‌ర్ లో సంభాష‌ణ‌లు చూస్తే..ఏదో పాత చింత‌కాయ ప‌చ్చ‌డి లాంటి ల‌వ్ స్టోరిని .. కొత్త గా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు అనిపిస్తుంది. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా న‌టించింది. గౌత‌మ్ టి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మ‌రి బావ క‌ళ్ల‌లో స‌క్సెస్ ఆనందం చూడాల‌ని ఆశ ప‌డుతున్న మ‌న నాగ చైతు ఆశ మ‌ళ్లీ రావా చిత్రం నిజం చేస్తుందా..? ఏం చూద్దాం. !