Malli Raava Movie Overseas Collectionsగత కొన్ని సంవత్సరాలుగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరోలలో అక్కినేని కాంపౌండ్ నుండి వచ్చిన సుమంత్ ఒకరు. రీమేక్ లతో సహా చాలా ప్రయత్నాలు చేసారు గానీ, ఏది సరైన సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. దీంతో దాదాపుగా ప్రేక్షకుల మదిలో నుండి సుమంత్ అనే పేరు ‘అవుట్ ఆఫ్ సిలబస్’గా మారిపోయింది.

అంతలా ఫేడ్ అవుట్ అయిన హీరో నటించిన తాజా చిత్రం “మళ్ళీ రావా”కు యుఎస్ఏలో ఆకర్షణీయమైన ‘రిటర్న్స్’ రావడం చెప్పుకోదగ్గ విషయమే. చాలా తక్కువ కేంద్రాలలో విడుదలైన ఈ సినిమా అమెరికాలో తొలి మూడు రోజులు గడిచేనాటికి 112979 డాలర్స్ ను కైవసం చేసుకోవడం అనేది ఈ అక్కినేని హీరోను పొగడాల్సిన విషయంగానే మారింది.

ఇండియన్ కరెన్సీలో 72.7 లక్షలు రాబట్టిన ఈ చిత్రం, ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాల కంటే మెరుగైన కలెక్షన్స్ నే అందుకుంది. సాయిధరమ్ తేజ్ ‘జవాన్’ 180 K డాలర్స్ ను మాత్రమే కైవసం చేసుకోగా, నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’ కేవలం 23K డాలర్స్ ను మాత్రమే సొంతం చేసుకుంది. ఫాంలో ఉన్న ఈ ఇద్దరి హీరోలతో పోలిస్తే సుమంత్ ముందు తరం క్రిందకే వస్తాడు కదా!