Making-of-Sye-Raa-Narasimha-Reddyమెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా ప్రమోషన్స్ కాసేపటి క్రితం మొదలయ్యాయి. చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీం విడుదల చేసింది. వీడియో మొదటి భాగంలో చిత్రంలోని విజువల్స్, సెట్స్, ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చిత్రం బృందం చూపించింది. తరువాతి భాగంలో సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేసారు. మొదటి భాగంలో చూపించిన విజువల్స్, సెట్స్, ఫైట్స్ అన్నీ అదిరిపోయాయి.

ఎక్కడ కంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్మించినట్టు అర్ధం అవుతుంది. మితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు అందరి గెట్అప్స్ బాగా కుదిరాయి. అయితే చివరిలో చూపించిన చిరంజీవి షాట్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది అని చాలా మంది అభిప్రాయం. అయితే 20న సినిమా కొత్త టీజర్ విడుదల చెయ్యబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఆ రోజున కొంత చిరంజీవి గెట్ అప్ మీద క్లారిటీ రావొచ్చు.

సైరా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలకు ప్రయత్నం చేస్తున్నారు. దేశంకోసం పోరాడిన ఒక వీరుడి గాధను దేశవ్యాప్తంగా పరిచయం చెయ్యాలని చిరంజీవి కోరికగా ఉంది. తొందర్లో ముంబై లో ఒక భారీ ఈవెంట్ లో సినిమా హిందీ ట్రైలర్ విడుదల చెయ్యడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుందని సమాచారం. చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చెయ్యడం తమకు కలిసి వస్తుందని చిత్రబృందం ఆశిస్తుంది.