Mahesh Koneru bags the telugu rights of vIjay Bigilబిజిల్ (విజిల్) అనే పేరుతో సినిమా చేస్తున్నాడు తమిళ యంగ్ సూపర్ స్టార్ విజయ్. మాస్ డైరక్టర్ అట్లీ ఈ సినిమాకు దర్శకుడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులను, చిత్తూరు జిల్లాకు ప్రత్యేకంగా తమిళ వెర్షన్ థియేటర్ హక్కులను తీసుకున్నారు. దాదాపుగా ఏడు కోట్లు దాకా మహేష్ ఈ హక్కుల కోసం చెల్లించినట్టు సమాచారం. ఈ వార్త రాగానే ఇంత పెట్టారా? ఏమి చూసుకుని వీళ్ళ ధైర్యం అన్న వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే ఈ సినిమా తెలుగు బిజినెస్ గొప్పగా ప్రారంభం అయ్యింది. ఆంధ్ర బిజినెస్ ఐదు కోట్ల రేషియోలో జరుగుతుందట. అదే రేషియో లో పద్మాకర్ సినిమాస్ వాళ్ళు గుంటూరు హక్కులను కైవసం చేసుకున్నారట. దీనితో మహేష్ కోనేరు టేబుల్ ప్రాఫిట్ తో బయట పడే అవకాశం ఉందంటున్నారు. దీపావళికి ఈ సినిమాను విడుదల చేస్తారు. వెంకీ-నాగచైతన్యల వెంకీమామకు సోలో డేట్ అనుకుంటే, ఇప్పుడు ఈ విజిల్ పోటీకి రెడీ అవుతోంది. దానితో వెంకీ మామ డిసెంబర్ మొదటి వారానికి వెళ్ళే అవకాశం ఉందట.

బిజిల్ కు సోలో రిలీజ్ దొరుకుంతుందేమో చూడాలి. ఇదిలావుంటే ఇదే డేట్ కు మరో తమిళ హీరో కార్తి సినిమా కూడా రెడీ అవుతోంది. అయితే కార్తీ ప్రస్తుతం ఉన్న ఫామ్ కు అది పెద్ద విషయం కాదు. ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్ లో ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఒక రోల్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తుండగా రెండోది మధ్య వయస్కుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై తమిళనాడులో అంచనాలు భారీగా ఉన్నాయి.