Mahesh Kathi says Pawan Kalyan has half knowledgeజనసేన అధినేతపై పదే పదే విమర్శలు చేస్తోన్న మహేష్ కత్తి వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నారన్న ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకున్న విషయం తెలిసిందే. ఇందులో వాస్తవం ఎంత ఉందో కాలమే సమాధానం చెప్పాలి గానీ, కత్తి మాత్రం పవన్ కళ్యాణ్ పై దండయాత్రను ఆపడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ హర్షం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ… పవన్ కళ్యాణ్ ది ‘హాఫ్ నాలెడ్జ్’ అంటూ ఫేస్ బుక్ వేదికగా మరోసారి మండిపడ్డారు.

వ్య‌వ‌సాయ శాఖ‌లో ఉద్యోగాలు, ప‌దోన్న‌తుల‌కు సంబంధించిన జీవో నెంబ‌రు 64ను ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ జీవోను ర‌ద్దు చేయాల‌ని అంత‌కు రెండు రోజుల ముందే ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కార్ ను ప‌వ‌న్ కళ్యాణ్ కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై వ్య‌వ‌సాయ ప‌ట్ట‌భ‌ద్రుల సంఘం ‘జనసేన’ అధినేతపై మండిప‌డుతూ గుంటూరు క‌లెక్ట‌రేట్ ఎదుట ధ‌ర్నాకు దిగింది.

“పవన్ త‌మ జీవితాల‌తో ఆడుకున్నాడ‌ని” ఆవేద‌న వ్య‌క్తం చేయగా, ఈ వార్త‌ను న్యూస్ పేప‌ర్‌ లో చూసిన మ‌హేశ్ క‌త్తి… హాఫ్ నాలెడ్జ్ ఎల్ల‌ప్పుడూ ప్ర‌మాద‌మేన‌ని ఫేస్‌ బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ అంశంపై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి పవన్ కళ్యాణ్ కు ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారో త‌న‌కు తెలియట్లేద‌ని మ‌హేశ్ క‌త్తి ఎద్దేవా చేశాడు. పవన్ కళ్యాణ్ ను నిలదీయడానికి వచ్చిన ఏ చిన్న సందర్భం కూడా మహేష్ కత్తి వదులుకోవడం లేదని ఈ సందర్భంగా నిరూపణ అవుతోంది.