ఇక చెప్పక తప్పదు బ్రదర్!

Mahesh Kathi comments on pawan kalyan fans about  Renu Desai  controversy‘బిగ్ బాస్’తో తనకొచ్చిన ఫేంను వినియోగించుకుని ఒక సెలబ్రిటీగా మార్చుకున్న మహేష్ కత్తిపై పవన్ ఫ్యాన్స్ చేసిన దాడులతో మీడియా వర్గాలలో ఓ రేంజ్ లో హల్చల్ చేసి, ప్రస్తుతం ‘మహేష్ కత్తి’ అంటే ఏంటో అందరికి తెలిసివచ్చేలా చేసారు. అప్పటినుండి సోషల్ మీడియాలో తన భావాలను నిరభ్యంతరంగా చెప్పడంలో ముందుంటున్న కత్తి, తాజాగా రేణుదేశాయ్ అంశంలో పవన్ ఫ్యాన్స్ చూపిన ఉత్సుకతను ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.

‘రేణుదేశాయ్ వ్యక్తిగత జీవితంపై పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేయడాన్ని తప్పుపట్టిన మహేష్ కత్తి, మరోసారి పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డారు. “పవన్ ఫ్యాన్స్ పిచ్చి పీక్స్ లో ఉందిగా” అంటూ ఫేస్ బుక్ వేదికగా కామెంట్ చేయడంతో, మళ్ళీ ప్రతిదాడి సర్వసాధారణమైంది. గత కొంతకాలంగా జరుగుతోన్న ఈ యుద్ధం ఇటీవలే సర్దుమణిగిందనుకున్న తరుణంలో… పవన్ ఫ్యాన్స్ మళ్ళీ ఓ అవకాశాన్ని ఇచ్చినట్లయ్యింది. దీంతో మరోసారి చెలరేగడం మహేష్ కత్తి వంతవుతోంది.

పవన్ అభిమానులు చేస్తున్న ఎదురుదాడితో స్పందించిన కత్తి… “చెప్తాం బ్రదర్… పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ ఇష్యూ చేసింది మీరు, ఇక చెప్పక తప్పదు బ్రదర్!” అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొడుతున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మహేష్ కత్తి పూర్తిగా సక్సెస్ అవుతుండగా, పవన్ ఉన్న అభిమానాన్ని చూపించడంలో తొందరపాటుకు గురవుతున్న ఫ్యాన్స్, ఇలాంటి వారికి ఓ అవకాశాన్ని ఇవ్వడంలో ముందుంటున్నారు.



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Anubhavinchu Raja Movie ReviewDon't MissAnubhavinchu Raja Review - Very Routine Raja!BOTTOM LINE Very Routine Raja! OUR RATING 2/5 CENSOR U/A What Is the Film About?...drushyam 2 Telugu Movie Review RatingDon't MissDrushyam 2 Review - Only For First Timers!BOTTOM LINE Only For First Timers! OUR RATING 2.5/5 Platform Amazon Prime What Is the...YCP Destruction in Kondapalli Muncipal Chaiman ElectionDon't Missవైసీపీ విధ్వంసం... హైకోర్టు అల్టిమేట్..!కృష్ణాజిల్లాలోని కొండపల్లి మునిసిపల్ ఛైర్మెన్ ఎంపికను అడ్డుకోవడంలో అధికార వైసీపీ పూర్తిగా విజయవంతం అయ్యింది. గత రెండు రోజులుగా వైసీపీ...Janasena Nadendla Manohar setires on Jagan Mohan ReddyDon't Missజనసేన ఎటకారం బానే ఉంది!రాష్ట్రానికి ఏదో చేస్తారని ఇంతకాలం వేచిచూసిన ప్రతిపక్షాలు, అధికార పక్షం తీరుతో విసిగిపోయి, ఇక ఎదురుదాడే అస్త్రంగా విపక్షాలన్నీ జగన్...Bad time for YS JaganDon't Missవైరల్ : జగన్ కు పదవీ గండం?జ్యోతిష్యం, జాతకాలు, వాస్తు... ఈ మూడింటిని విశ్వసించడంలో రాజకీయ నేతలు, సినీ వర్గాలు ముందు వరుసలో ఉంటారు. ఏ చిన్న...

Mirchi9