నాటకీయ పరిణామాల నడుమ మహేష్ బాబు – నమ్రతల వివాహం చేసుకోవడంపై గతంలో పలు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ మీడియా ఛానల్ అయితే దీనిపై డిబేట్ ను నిర్వహించగా, ఆ తర్వాత అదే మీడియా ఛానల్ లో కూర్చుని మహేష్ వేసిన పంచ్ అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది.
వ్యక్తిగత విషయాలపై ప్రస్తావించవద్దన్న భావనను మహేష్ వ్యక్తపరచగా, అప్పటి నుండి మళ్ళీ ఎవరూ కూడా మహేష్ వివాహంపై కామెంట్ చేయలేదు. కానీ ‘అన్ స్టాపబుల్’ షోలో మాత్రం మహేష్ పెళ్లి ప్రస్తావనను బాలయ్య ఎత్తడం విశేషం.
చిలిపి చిలిపిగా అనేక చేష్టలు చేస్తోన్న బాలయ్య, అదే క్రమంలో ఏంటి నువ్వు పెళ్లి అంత సీక్రెట్ గా చేసుకున్నావని బాలయ్య వేసిన ప్రశ్నకు, ‘ఏం అడుగుతున్నారనే’ విధంగా మహేష్ ప్రదర్శించిన దరహాసం ఈ ఎపిసోడ్ పై ఇద్దరి హీరోల అభిమానులకు మరింత ఆసక్తిని పెంచేలా చేసింది.
4వ తేదీ రాత్రి 8 గంటలకు ఆహాలో ఈ ఎపిసోడ్ ప్రత్యక్షం కానుంది. సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ గా బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకు ఈ ఎపిసోడ్ గ్రాండ్ క్లైమాక్స్ ను ఇవ్వనుంది. ప్రస్తుతం నందమూరి – ఘట్టమనేని అభిమానులందరూ ఈ ‘ఫ్రైడే రిలీజ్’ కోసం నిరీక్షిస్తున్నారు.
Jagan Bhajana Batch Exposed!
F3 Review – Over the Top but Faisa Vasool