mahesh-babu-with-vennela-kishoreన్యూ లుక్ లో ప్రిన్స్ అవతారం అభిమానులకు చూడముచ్చటగా ఉంటోంది. అలా కన్నులవిందు చేస్తోన్న ఓ ఫోటోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘అభి బస్’ యాడ్ లో భాగంగా జరుగుతోన్న షూటింగ్ గ్యాప్ లో దిగిన ప్రిన్స్ – సితార – వెన్నెల కిషోర్ లు కలిసి దిగిన ఈ ఫోటోలో ఎప్పటిలానే సితార సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఆకర్షణతో కూడిన హావాభావంతో కట్టిపడేస్తోన్న ఈ పిక్ లో ప్రిన్స్ కూడా అదిరిపోయే విధంగా ఉంది. అలాగే క్లీన్ షేవ్ చేసుకుని వెన్నెల కిషోర్ కూడా బానే తళుక్కుమన్నాడు. ప్రిన్స్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న తరుణంలో బయటకు వచ్చిన ఈ ఫోటో, ఫస్ట్ లుక్ కిక్ ను ఫ్యాన్స్ కు మరింతగా పెంచుతోంది.