Mahesh Babu - Vamsi -Paidipallyప్రిన్స్ కెరీర్ లో 25వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కొల్లగొట్టిన వంశీ పైడిపల్లి నేడు (శుక్రవారం) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన యంగ్ డైరెక్టర్ మరియు స్నేహితుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ… వంశీ పైడిపల్లి, మహేష్ లు నవ్వుతూ ఉన్న ఓ పిక్ ను పోస్ట్ చేసాడు ప్రిన్స్.

వంశీ పుట్టినరోజు సందర్భంగా పోస్ట్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ స్పాట్ లో ఫోటో కావడంతో, ప్రిన్స్ గడ్డం, హెయిర్ స్టైల్ తో మెరిసిపోతున్నారు. అలాగే ఈ సినిమా సెట్స్ నుండి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ క్రికెట్ మైదానంలో మహేష్ కూడా ఉండడం విశేషం.