Not-Sankranthi-Mahesh-Babu-25-Aiming-for-Another-Festivalప్రిన్స్ మహేష్ బాబు… టాలీవుడ్ లో టాప్ స్టార్. దక్షిణాది చిత్రసీమలో అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న హీరో. దేశవ్యాప్తంగా పాపులారిటీ కలిగిన ప్రాంతీయ భాష స్టార్. విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న యాక్టర్. ఇలా ఎన్ని చెప్పుకున్నా… ఇంకా ఎంతోకొంత మిగిలి ఉంటుందనిపించే విధంగా దూసుకేల్తోన్న ప్రిన్స్ గురించి వికీపీడియాలో రోజుకు చాలామంది వెతికేస్తున్నారు.

ఈ ఏడాది జనవరి ఒకటి నుండి ఇప్పటివరకు మహేష్ బాబు వికీపీడియా పేజిని రోజుకు సగటున దాదాపుగా 6400 మందికి పైనే ఓపెన్ చేసి చూస్తున్నారు. యధావిధిగా టాలీవుడ్ విభాగంలో ప్రిన్స్ మొదటి స్థానంలో నిలువగా, ఇటీవల వరుస సక్సెస్ లతో, వివాదాలతో ఉన్న అల్లు అర్జున్ రెండవ స్థానంలో ఉన్నారు. బన్నీ గురించి రోజుకు సగటున 5500 మందికి పైగా వికీపీడియా ఓపెన్ చేసి చూస్తున్నారు.

విశేషం ఏమిటంటే… పవర్ స్టార్ గా, జనసేన అధినేతగా పవన్ గురించి అందరూ తెలుసుకుంటారు అని భావించిన వారికి ఇందులో మాత్రం షాక్ తగిలింది. మహేష్, బన్నీల తర్వాత చెర్రీ, ప్రభాస్ లు నిలువగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉండడం విశేషం. పవన్ గురించి వికీపీడియాలో రోజుకు సగటున దాదాపుగా 3700 మందికి పైగా ఓపెన్ చేసి చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత స్థానంలో నిలిచారు.