Mahesh-Babu-Wax-Statueటాలీవుడ్ హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత మేడం టుస్సాడ్స్ లో చోటు దక్కించుకొబోతోన్న హీరోగా ప్రిన్స్ మహేష్ బాబు నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రిన్స్ కు సంబంధించిన కొలతలన్నీ తీసుకోగా, ప్రస్తుతం అది తుదిరూపు దిద్దుకుంటోంది. మరి మైనపు బొమ్మలో మహేష్ బాబు ఎలా ఉన్నాడు? అంటే…

ఆ ‘చరిష్మా’ ఎక్కడున్నా అలాగే ఉంటుందనిపించే విధంగా ఈ మైనపు విగ్రహం తయారవుతోంది. ఇవాన్ రీస్ నేతృత్వంలో మెరుగులు దిద్దుకుంటోన్న దీని ఫస్ట్ లుక్ విడుదల కాగా, ప్రిన్స్ అభిమానుల నుండి దీనికి విశేషమైన స్పందన లభిస్తోంది. మహేష్ ఫేస్ లో ఎంత గ్లౌ ఉంటుందో, ఈ మైనపు బొమ్మలో కూడా అదే స్థాయిలో కనిపిస్తుండడం ఫ్యాన్స్ ను కొత్త ఉత్తెజంలో నింపుతోంది.

ముఖ్యంగా “భరత్ అనే నేను” సినిమా ఈ శుక్రవారంతో వంద రోజులను పూర్తి చేసుకుంటున్న తరుణంలో బయటకు వచ్చిన టుస్సాడ్స్ ఫస్ట్ లుక్ కు ఫిదా అవుతున్నారు. ఫైనల్ గా ఈ విగ్రహం తయారైన తర్వాత మహేష్ పక్కన ఈ మహేష్ ను పెడితే అభిమానులకు ‘ఐ ఫీస్ట్’ ఖాయం అన్న నమ్మకాన్ని ఈ ఫస్ట్ లుక్ ఫోటో కలిగించింది.