Mahesh -Babu Vogueసూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. హోల్ ఇండియాకు ఆయన సోల్ అందగాడు. వయసు పెరుగుతున్న కొద్దీ బాబు గ్లామర్ పెరుగుతుంది. దీనికి మరో తార్కాణం ఇది. మహేష్ బాబు ఈ నెల వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద దర్శనం ఇచ్చారు.

ఈ ఫోటో షూట్ లో మహేష్ బాబు అదిరిపోయాడు. పున్నమి చంద్రుడిలా మెరిసిపోతున్నాడు. డెనిమ్ లో ఉన్న ఫొటోలో అయితే మహేష్ పాతికేళ్ళ కుర్రోడిలా ఉండటం గమనార్హం. వోగ్ ఈ చిత్రాలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో రిలీజ్ చెయ్యడంతో లైక్స్ ముంచెత్తుతున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. సంక్రాంతి బరిలో బన్నీ అల వైకుంఠపురములో సినిమాతో పోటీ పడుతుంది.