mahesh-babu-visited-burripalem-gunturటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బుర్రిపాలెం సందర్శించనున్నాడన్న సమాచారంతో ఆ గ్రామంలో కోలాహలం నెలకొంది. ఎక్కడెక్కడో విద్య, ఉద్యోగాలు చేసుకుంటున్నవారంతా బుర్రిపాలెం చేరుకున్నారు. మహేష్ ప్రణాళికకు చేయూతనివ్వాలని తీర్మానించుకున్నారు. మహేష్ బాబు టీ షర్టులను ధరించి అభిమానుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని, రక్షణగా నిలుస్తామని యువతరం పేర్కొంటున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల నుంచి మహేష్ బాబు అభిమానులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున బుర్రిపాలెం చేరుకున్నారు. చేరుకుంటున్నారు. మహేష్ రాకకు అభినందనలు తెలుపుతూ దారంతా భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు.

మహేష్ బాబు నివాసం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుర్రిపాలెం చేరుకుని అక్కడ పలు కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్న మహేష్ దత్తతతో స్థానిక యువకుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఊరు విడిచి వెళ్లినవారు తిరిగి స్వస్థలాలకు తిరిగి రావడం లేదని, సొంత తల్లిదండ్రులను కూడా చూసేందుకు వెనక్కి రావడంలేని తరుణంలో, ఎంతో ఎత్తుకు ఎదిగి, సొంత ఊరును మర్చిపోకుండా మహేష్ బాబు రావడం తమలో స్పూర్తి నింపుతోందని తెలిపారు. హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న మహేష్ బాబుకు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతల మధ్య, వారు ర్యాలీగా అనుసరిస్తుండగా మహేష్ బాబు బుర్రిపాలెం బయల్దేరారు.