Mahesh Babu -Unstoppable With NBKసూపర్ స్టార్ మహేష్ బాబు బయట పబ్లిక్ కు కనపడితే ఎలా ఉంటుంది? రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే పరిస్థితి అదుపు తప్పడం ఖాయం. అదే ముంబైలో అయితే… అలాంటి ఓ చిన్న కధే బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ లో బయటకు వచ్చింది.

ముంబై మారియట్ హోటల్ లో మహేష్ కుటుంబం – దర్శకుడు మెహెర్ రమేష్ కుటుంబంతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సందర్భంలో ఇద్దరు అందమైన అమ్మాయిలు మహేష్ దగ్గరకు వచ్చి, మీతో ఓ ఫోటో కావాలని అడిగారని మెహెర్ రమేష్ చెప్పి, మిగతాది మహేష్ ను చెప్పాల్సిందిగా కోరారు.

అయితే వారికి ఫోటో ఇవ్వడానికి తిరస్కరించిన మహేష్, ఇప్పుడు కుటుంబంతో కలిసి ఉన్నాను, తర్వాత చూద్దామని చెప్పి పంపించేసానని అన్నారు. ఆ తర్వాత రమేష్ వచ్చి, ఆ ఇద్దరు అమ్మాయిలు దర్శకుడు శంకర్ గారి కూతుళ్లు అని చెప్పగానే ఒక్కసారిగా తనకేం అర్ధం కాలేదని అన్నారు సూపర్ స్టార్.

ఆ తర్వాత వెంటనే కిందకి వెళ్లి దర్శకుడు శంకర్ గారికి సారీ చెప్పి, మీ అమ్మాయిలని తెలియదు సర్ అన్నానని తెలిపారు. లేదు లేదు… హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి తెలియాలి కదా అని నేనే పంపించాను అని చెప్పగానే ఆడిటోరియం అంతా నవ్వుల్లో మునిగిపోయింది.