Mahesh babu Tweets on Baahubali 2the conclusionగత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియా నిండా ‘బాహుబలి 2’ తప్ప మరొక విషయం లేదు. విడుదల ముందు వరకు టికెట్లు విషయం, ప్రీమియర్ షోల వివరాలు అంటూ సందడి చేసిన అభిమానులు, విడుదల తర్వాత సినిమా ఎలా ఉందో అనుభూతులు పంచుకుంటూ హల్చల్ చేస్తున్నారు. అలాగే అంచనాలకు మించి కలెక్షన్స్ కొల్లగొట్టడంతో వాటిని షేర్ చేసుకుంటూ మరింత సందడి వాతావరణం నెలకొంది. ఇది సాధారణ సినీ ప్రేక్షకుల వరకే పరిమితం కాలేదు.

ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఇందులో భాగస్వామి అయ్యారు. టాలీవుడ్ నుండి వర్ధమాన నటీనటులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు “బాహుబలి 2”పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేసారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు వంతు వచ్చింది. “స్టోరీ టెల్లర్ లో మాస్టర్ అయిన రాజమౌళి ‘బాహుబలి 2’తో మన ముందుకు వచ్చి, అంచనాలను మించి అందుకున్నారని, ఏ గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తూ… రాజమౌళికి, చిత్ర యూనిట్ కు హ్యాట్సాఫ్ చెప్పారు” ప్రిన్స్.

అయితే మహేష్ చెప్పిన “గేమ్ చేంజర్” భావమేమి? అంటూ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. ఈ సినిమాతో ప్రభాస్ నెంబర్ 1 హీరోగా అవతరించాడని ప్రిన్స్ పరోక్షంగా చెప్పారా? లేక ఇండియన్ ఫిల్మ్ హిస్టరీని తిరిగి రాస్తుండడంతో… ఆల్ టైం నెంబర్ 1 సినిమాగా “బాహుబలి 2” అవతరిస్తుందని అన్నారా? ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలే రాజ్యమేలిన చోట ‘బాహుబలి 2’ ద్వారా తెలుగు వాడి సత్తాను చూపించడంతో మన ఆధిపత్యంలో భాగంగా చెప్పారా? అంటూ రకరకాలుగా చర్చలు జరుపుతున్నారు.