Mahesh babu tweet on Oopiri movieవిమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు అందుకున్న “ఊపిరి” సినిమాపై సినీ సెలబ్రేటీలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి వంటి ప్రముఖ దర్శకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేయగా, తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు “ఊపిరి” సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు.

‘అద్భుతంగా దర్శకత్వం వహించి, నటించిన సినిమా “ఊపిరి” అని, ఇంత మంచి సినిమాను అందించిన “ఊపిరి” చిత్ర యూనిట్ మొత్తానికి తన అభినందనలు తెలుపుతున్నానని’ ప్రిన్స్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అతి కొద్ది సందర్భాలలో మాత్రమే ట్వీట్ చేసే ప్రిన్స్, ‘ఊపిరి’ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ప్రత్యేకమే అయినా… ‘ఊపిరి’ సినిమా చూసిన తర్వాత ఎవరైనా పొగడాల్సిందే అనే విధంగా సినిమా ఉందని ప్రేక్షకులు ఇప్పటికే తీర్పు ఇచ్చేసారు.