mahesh-babu-sumanth-naruda-donarudaసినిమా ఇండస్ట్రీలో మహేష్ కున్న సన్నిహిత వర్గాలలో హీరో సుమంత్ ఒకరు. సినిమాల పరంగా ఇద్దరూ పెద్దగా కలుసుకోకపోయినా… వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒకరికొకరు పార్టీలు చేసుకున్న ఫోటోలు గతంలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్ పెళ్లి విషయంలో అండగా నిలిచాడన్న టాక్ ఉంది. ఇదిలా ఉంటే ఎన్నాళ్ళ నుండో ఒక హిట్ కోసం వేచిచూస్తున్న తన స్నేహితుడు సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రిన్స్ విడుదల చేయనున్నాడు.

నాని ‘మజ్ను’ సినిమా ధియేటర్లలో ఇప్పటికే ప్రదర్శితమై, ప్రేక్షకుల మన్ననలు పొందిన సుమంత్ చిత్రం ‘నరుడా… డోనరుడా…’ డిజిటల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నాడు మహేష్. ఈ నెల 27వ తేదీన విడుదల కానున్న ఈ ట్రైలర్ పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘వీర్య దానం’ కాన్సెప్ట్ ను తెలుగుకు అనుకూలంగా ఏ విధంగా అనువాదం చేసారో అన్న ఆసక్తి సినీ జనాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రావడంతో, ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లోకి దూసుకెళితే, సుమంత్ కు కావాల్సిన ఆ ఒక్క విజయం అందుకోవడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు.