Mahesh-Babu-Superstar‘భరత్ అనే నేను’ సంతోషంలో మునిగి తేలుతున్న ప్రిన్స్ మహేష్ బాబు, గతంలో ఎన్నడూ చేయని కొన్ని పనులను చేసి చూపిస్తున్నారు. కాస్ట్యూమ్స్ దగ్గర నుండి మాట తీరు వరకు చాలా విషయాలలో మహేష్ లో వచ్చిన మార్పు బహిరంగంగానే కనపడుతోంది. అదే కోవలో తాజాగా తన మహిళా అభిమాని పెళ్లి సందర్భంగా గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి అవాక్కు చేసాడు.

సులేఖ అనే ప్రిన్స్ అభిమాని పెళ్లి సందర్భంలో ‘ప్రేమతో మీ మహేష్ బాబు, నమ్రత శిర్కొదర్’ అంటూ ఇరువురు సంతకాలు చేసిన గ్రీటింగ్ కార్డ్ ను ఆమెకు పంపించగా, సరిగ్గా పెళ్లి రోజున ఆ గ్రీటింగ్ కార్డ్ ను బంధువులు ఆమెకు చూపించగా, షాక్ తిన్న ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఫోటోలు కెమెరా మెన్ క్లిక్ చేయగా, సదరు వార్తను ఓ ప్రముఖ టాబ్లాయిడ్ ప్రచురించింది.