Here’s-Why-Change-In-MaheshBabu’s-Plan--Is-Good-News-For-Fans!---Maharshiసూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోందని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఉన్నఫళంగా ఆ సినిమా అటకెక్కింది. ఆ స్థానములో బన్నీతో సినిమా తీస్తున్నాడు సుకుమార్. సినిమా పరంగా వచ్చిన స్పర్ధల వల్ల తాను సుకుమార్‌తో కలిసి పనిచేయడంలేదని మహేశ్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. సుకుమార్ కు తన తదుపరి చిత్రానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు మహేష్ బాబు

‘కొన్ని కారణాల వల్ల సుకుమార్‌తో నేను సినిమా చేయడంలేదు. ఆయన కొత్త ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న సందర్భంగా ‌ విషెస్‌ చెప్పాలనుకుంటున్నాను. అద్భుతమైన ప్రతిభ ఉన్న ఓ దర్శకుడిని నేనెప్పుడూ గౌరవిస్తాను. ఆయన దర్శకత్వంలో నేను నటించిన ‘నేనొక్కడినే’ క్లాసిక్‌ చిత్రంగా నిలిచిపోతుంది. ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రతీ క్షణాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశాను. మీరు తీస్తున్న కొత్త సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ సర్‌..’ అని పేర్కొన్నారు మహేష్ బాబు. అయితే మహేష్ కు సుకుమార్ తో స్పర్ధలు మొదటి సారి కాదు.

గతంలో సుకుమార్ రామ్ తో తీసిన జగడం అనే సినిమా మహేష్ బాబుతో చెయ్యాల్సి ఉంది. కాకపోతే మహేష్ ఆ సినిమా స్క్రిప్టులో కొన్ని మార్పులు చెప్పారు. అవి చెయ్యడానికి సుకుమార్ ఒప్పుకోలేదు. దీనితో మహేష్ ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. చాలా ఏళ్ల తరువాత అదే విధంగా ఇంకో సినిమా వీరి కాంబినేషన్ లో ఆగిపోయింది. బన్నీతో ఇప్పుడు తీస్తున్న సినిమా మహేష్ కాదు అనుకున్నదో కాదో తెలియదు. అప్పట్లో మహేష్ బాబు కాదనుకున్న జగడం ప్లాప్ అయ్యింది. ఇప్పుడు సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి.