Director Trivikramసినిమా ఫ్లాప్ అయినా సరే వంద కోట్లు సులభంగా రాబట్టే హీరో దొరికినప్పుడు అందులోనూ టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ల లిస్టులో రెండో స్థానంలో ఉన్న దర్శకుడు ఉన్నప్పుడు అంచనాలు విపరీతంగా ఎగబాకడం సహజం. అందుకే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ మీద అంత క్రేజ్. అతడు రిలీజైన టైంలో నిర్మాత మురళీమోహన్ కు లాభాల వర్షం కురవలేదు. సక్సెస్ అయ్యింది కానీ టీవిలో టెలికాస్ట్ అయ్యాకే డబ్బులు బాగా వచ్చాయి. ఇక ఖలేజా సంగతి సరేసరి. ఫ్యాన్స్ కల్ట్ అని పొగడటమే కానీ ఇది పక్కా ఫెయిల్యూర్ మూవీనే. అయినా సరే ఈ కలయిక మీద ఏళ్ళ తరబడి నమ్మకం ఉంటూనే వస్తోంది.

ఇప్పుడు మహేష్ బాబుతో ముచ్చటగా మూడో సినిమా సిద్ధమవుతోంది. మొదలుపెట్టినప్పటి నుంచి ఒకటే అవాంతరాలు. స్క్రిప్ట్ కోసం నెలలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మొదట తీసిన షెడ్యూల్ లో ఫైట్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు. తర్వాత ఏవేవో రిపేర్లు చేసి కథను మార్చి ఫైనల్ గా ఫ్యామిలీ కం మాస్ ఎంటర్ టైనర్ ని సిద్ధం చేశారు. ఆగస్ట్ 11 విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ ఎప్పుడో చెప్పారు. తీరా చూస్తే పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. 2024 సంక్రాంతికి వెళ్తోందని ఆల్రెడీ లీకులు మొదలుపెట్టారు.

Also Read – నీలి మీడియాకు రక్త కన్నీరే..!

ఎంత మహేష్ రేంజ్ స్టార్ అయినా మరీ ఇంత జాప్యం ఎందుకనేది అంతు చిక్కని ప్రశ్న. ఇదే హీరోతో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరుతో పూరి జగన్నాధ్ బిజినెస్ మెన్ తక్కువ రోజుల్లో పూర్తి చేసి బ్లాక్ బస్టర్లు ఇచ్చారుగా. మరి త్రివిక్రమ్ కు సమస్య ఎక్కడ వస్తోంది. భీమ్లా నాయక్ కు డైలాగులు రాయాల్సి వచ్చింది. వినోదయ సితం రీమేక్ కోసం సాయిమాధవ్ బుర్ర వెర్షన్ నచ్చక మళ్ళీ తనే పెన్ను పట్టుకుని స్క్రిప్ట్ రీ రైటర్ చేశారు. ఇవన్నీ గంటల్లో రోజుల్లో జరిగే వ్యవహారాలు కాదుగా.చాలా సమయమే ఖర్చు పెట్టారు.

వీటి వల్లే త్రివిక్రమ్ కు తమ సినిమా మీద ఫోకస్ తగ్గి ఆలస్యమవుతోందనేది మహేష్ ఫాన్స్ ఫీలింగ్. గ్రాఫిక్స్ లేకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీస్తున్నప్పుడు ఎందుకు ఇంత లేట్ చేయడమనే ప్రశ్నకు సమాధానం వాళ్ళిద్దరికే తెలుసు. గురూజీ అంటే గుండెల్లో పొడిచేస్తున్నారని కామెంట్ చేస్తున్న ఫ్యాన్స్ లేకపోలేదు. సంక్రాంతి మంచి సీజన్ అనొచ్చు. కానీ క్రేజీ కాంబోతో పవర్ ఫుల్ సబ్జెక్టు చేతిలో ఉన్నప్పుడు ఏ నెల అయితేనేం రికార్డులు ఖాయమే. పోకిరి వచ్చింది పండక్కు కాదే. శ్రీమంతుడు డేట్ గుర్తుందిగా. పవన్ వల్లనా ఇంకేమైనా ఇతరత్రా కారణాలు ఏవైనా సరే అందరి వేళ్ళు జరుగుతున్న పరిణామాలకు బాధ్యుడిగా త్రివిక్రమ్ వైపే చూపిస్తున్నాయి.

Also Read – నువ్వే మా నమ్మకం… మా భవిష్యత్‌ బాబూ!