Spyder Advance Bookings BO –Career Best Done, Industry Best Awaited‘స్పైడర్’ సినిమాలో ఉన్న ప్రధాన హైలైట్స్ లో “రోలర్ కోస్టర్” యాక్షన్ సన్నివేశం ఒకటన్న టాక్ ఎప్పటినుండో హల్చల్ చేస్తోంది. పీటర్ హైన్స్ నేతృత్వంలో చిత్రీకరించిన ఈ సీన్ గురించి సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “నిజానికి రోలర్ కోస్టర్ పై ఎలాంటి సన్నివేశం చిత్రీకరించాలన్నా చాలా కష్టమైన విషయమని, అలాంటిది హై యాక్షన్ సీన్ అనే పాటికి మరింత కష్టమైందని అన్నారు.

ఇందు కోసం హై ఎండ్ కెమెరాలను వినియోగించామని, మహేష్, భరత్ లు పాల్గొన్న ఈ షాట్స్ చాలా రిస్క్ తో కూడుకున్నవని, అన్ని సేఫ్టీలు తీసుకున్నప్పటికీ, నేనే గనుక ఆ స్థానంలో ఉంటే ఖచ్చితంగా చేసేవాడ్ని కాదని, ‘హలో బాస్… నమస్తే…’ అని చెప్పేసి వెళ్ళిపోయేవాడినని, అంత రిస్క్ తో కూడుకున్న షాట్ అని సంతోష్ శివన్ చెప్పుకొచ్చారు. దీంతో ‘స్పైడర్’ హైలైట్స్ లో ఖచ్చితంగా ఈ సీన్ ఒకటని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.