Spyder Advance Bookings BO –Career Best Done, Industry Best Awaited‘స్పైడర్’ టీజర్, ట్రైలర్లను డైరెక్టర్ మురుగదాస్ ఆసక్తికరంగా కట్ చేయలేదన్నది వాస్తవం. అయితే ప్రమోషన్ కార్యక్రమాలలో మురుగదాస్ గానీ, మహేష్ గానీ చెప్తున్న తీరు చూస్తుంటే… ఈ ట్రైలర్, టీజర్లలో చూపించింది కాకుండా ఇంకొన్ని ఆసక్తికరమైన అంశాలు సినిమాలో ఉన్నట్లుగా అర్దమవుతున్నాయి. నిజానికి ఇలాంటి ట్రైలర్ పై అటు అభిమానులకు గానీ, ఇటు సినీ ప్రేక్షకులకు గానీ ఏ మాత్రం ఆసక్తి కలుగదు. కానీ అందుకు విరుద్ధంగా మురుగ – మహేష్ లపై పెట్టుకున్న విశ్వాసంతో… ‘స్పైడర్’పై భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

అందుకు తగ్గట్లుగానే “స్పైడర్” ఉంటుందని, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు తోడు, మురుగదాస్ మార్క్ ఏమోషనల్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని, అలాగే సోషల్ మెస్సేజ్ కూడా కధలో మిళితమై ఉంటుందని… తాజా ఇంటర్వ్యూలలో ప్రిన్స్ చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమాలో ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయని, అవన్నీ సిల్వర్ స్క్రీన్ పై చూపించాలని అనుకున్నామని, వాటిని బిగ్ స్క్రీన్ పైనే చూసి ఎంజాయ్ చేయండి… అంటూ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కూడా ఓ పిలుపునిచ్చారు ప్రిన్స్.

ఇదే నమ్మకం ప్రిన్స్ అభిమానుల్లో కూడా వ్యక్తమవుతోంది. ‘తుపాకీ’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడి నుండి ఓ సాధారణ ట్రైలర్ వచ్చినా, సినిమాలో ఖచ్చితంగా “విషయం” ఉండి తీరుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఈ ప్రభావమే “స్పైడర్” భారీ ఓపెనింగ్స్ కు కారణమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా భారీ ఓపెనింగ్స్ ను ‘స్పైడర్’ సొంతం చేసుకుంటోందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నారు. ఇప్పటికే యుఎస్ మార్కెట్ లో అడ్వాన్సు బుకింగ్స్ లో సెన్సేషన్ సృష్టించిన ‘స్పైడర్’ మరిన్ని రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.