mahesh babu son gautham in dubaiప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమా ఊటీ షెడ్యూల్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. దీంతో కొంత సమయం లభించడంతో మళ్ళీ తన భార్య, పిల్లలతో కలిసి టూర్ కు చెక్కేసారు. ఇటీవల తన సోదరుడి (బాబాయ్ కొడుకు) వివాహ మహోత్సవాన్ని చూసుకున్న తర్వాత ప్రిన్స్ టూర్ కు వెళ్ళిపోయారు.

అయితే ఎక్కడికి వెళ్ళారోనన్న అభిమానుల సందేహాన్ని ప్రిన్స్ చేసిన తాజా ట్వీట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రిన్స్ దుబాయ్ లో తన ఫ్యామిలీతో పండగ చేసుకుంటున్నారు. దుబాయ్ లో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటిగా పేరు గాంచిన “ది బూర్జ్ ఖఫ్లియా” మబ్బులలో కలిసిపోయిందని, దుబాయ్ లో ఉన్న వాతావరణం ఇందుకు నిదర్శమని, కొడుకు గౌతమ్ హ్యండ్సప్ అన్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసారు. దీంతో దుబాయ్ లో ఉన్న ప్రిన్స్ అభిమానులు ‘మేము ఇక్కడే ఉన్నాం… మీ చిరునామా చెప్పగలరు…’ అంటూ ప్రిన్స్ ను ప్రశ్నిస్తున్నారు. అన్నట్లు… కొత్త సంవత్సరం వేడుకలను కూడా ప్రిన్స్ దుబాయ్ లోనే జరుపుకోబోతున్నారు.