Mahesh-Babu-Sitaraప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితార 6వ పుట్టినరోజును మహేష్ బాబు ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. తాను సితారను ఎత్తుకున్న ఓ ఫోటోను పోస్ట్ చేసిన మహేష్, తన తనయురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫోటోకు సెలబ్రిటీల నుండి నెటిజన్ల వరకు మంచి స్పందన వస్తోంది. ఫోటో పోస్ట్ చేసిన వెంటనే బ్రహ్మజి అయితే “ఇద్దరూ ఇద్దరే… ఎంత క్యూట్ గా ఉన్నారో…” అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇక అభిమానుల హంగామాకైతే కొదవేలేదు. అసలే సోషల్ మీడియాకు సితార ఫోటోలు హాట్ టాపిక్. ముద్దొచ్చే విధంగా ఫోజులను ఇస్తూ సితార ఫోటోలు చేసే సందడి నెటిజన్లకు తెలియనిది కాదు. ఈ సందర్భంగా ఆ క్యూట్ క్యూట్ ఫోటోలన్నీ మరోసారి హల్చల్ చేస్తున్నాయి. సితారలో మహేష్ తల్లి ఇందిర మరియు మహేష్ పోలికలు ఉన్నాయంటూ… ఇరువురి ఫోటోలను పక్కపక్కనే పెట్టి చేస్తోన్న హంగామాకు అంతేలేదు.