కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ సినిమాకు ఉన్న హైలైట్స్ లో హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన ‘గ్యారేజ్’ సెట్ ఒకటి. ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఈ గ్యారేజ్ లోనే జరుపుకోగా, తాజాగా ఇదే సెట్స్ లో ప్రిన్స్ మహేష్ బాబు అడుగుపెట్టారు. అవును… మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రిన్స్ మూవీ షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోస్ లోనే జరుగుతోంది.
సారధి స్టూడియోలో మహేష్ బాబు పాల్గొనగా పలు యాక్షన్ దృశ్యాలను చిత్రీకరణ జరిపినట్లుగా సమాచారం. ఇటీవలే చెన్నైలో కొద్ది రోజుల పాటు షూటింగ్ జరుపగా, తాజాగా వెన్యూ హైదరాబాద్ కు మారింది. ఆ తదుపరి చెన్నైలో ప్రత్యేకంగా వేసిన మరో ఏకంగా 40 రోజుల పాటు షూటింగ్ జరపనుంది చిత్ర యూనిట్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ప్రిన్స్ కెరీర్ లో మొదటిసారి కావడంతో, ఎంతో ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకుంది. మహేష్ తో సహా అందరూ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి డైలాగ్స్ చెప్తున్నారని తెలుస్తోంది.