Mahesh babu, Director Sukumar -‘ప్రయోగాలు చేయను, ఇక అలా చేస్తే నాన్న గారి అభిమానులు ఇంటికి వచ్చి మరీ కొట్టేలా ఉన్నారు’ అని చెప్పిన కొద్దిరోజులకే మహేష్ బాబు నోటి వెంట సుకుమార్ తో సినిమా ఉందని స్పష్టం చేసారు. సుకుమార్ కున్న ట్రాక్ రీత్యా, దీంతో మరో ప్రయోగానికి ప్రిన్స్ రెడీ అయ్యారన్న సంకేతాలు ఫ్యాన్స్ లో బలంగా వెళ్ళాయి. దీంతో ఈ సారి కూడా ప్రయోగం చేయబోతున్నారా? కమర్షియల్ సబ్జెక్ట్ తో రాబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి.

వీటిపై ప్రిన్స్ క్లారిటీ ఇచ్చారు. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సెస్ తర్వాత మొదటిసారిగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “అవును సుకుమార్ తోనే తన తదుపరి సినిమా ఉంటుంది. ‘1 నేనొక్కడినే’ పరాజయం పాలైనప్పటికీ, మంచి అభినయం ప్రదర్శించిన సినిమాలలో అది ఒకటని, కాస్త ఎడిటింగ్ కు టైం ఇచ్చి ఉంటే సినిమా బాగా ఆడేదన్న ఫీలింగ్ తనలో ఉందని, ఈ సారి ప్రయోగం కాదు, పక్కా కమర్షియల్ సబ్జెక్ట్” అంటూ స్పష్టం చేసారు.

ఇటీవల ‘రంగస్థలం’ చూసి ట్వీట్ కూడా చేశాను, కొత్తగా గ్రామీణ నేపధ్యం ఎంచుకుని ఎలా అయితే సక్సెస్ అందుకున్నారో, మా ‘భరత్ అనే నేను’ కూడా పొలిటికల్ నేపధ్యం ఎంచుకుని సక్సెస్ అయ్యామని అన్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు గానీ, అయితే వాటితో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని ఆశిస్తారని, నా తప్పులను తెలుసుకున్నాను, మున్ముందు మంచి సినిమాలు చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు ప్రిన్స్.