Sarkaru Vaari Paata kalavathi song promoసూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎన్నాళ్ళుగానో నిరీక్షిస్తోన్న “సర్కారు వారి పాట”కు సంబంధించిన తొలి పాట గ్లిమ్స్ విడుదలైంది. “పోకిరి” స్టైల్ లో కనిపించిన మహేష్ బాబుని చూసి మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది.

సోషల్ మీడియా అంతటా కూడా ‘పోకిరి’ సినిమాలోని స్క్రీన్ షాట్స్ ను ‘సర్కార్ వారి పాట’లోని సాంగ్ తో పోలుస్తూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. 39 సెకన్ల ఈ వీడియోలో మహేష్ బాబు లుక్స్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఫిదా చేసాయి.

ఇక పాట విషయానికి వస్తే… థమన్ సంగీతం అందిస్తోన్న ఈ పాటను సూపర్ హిట్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన సిడ్ శ్రీరామ్ ఆలపించారు. క్యూట్ లుక్స్ తో పడేసిన మహేష్ ఛరిష్మాకు సిడ్ శ్రీరామ్ స్వరం కొత్తగా అనిపించింది.

ఇది కేవలం గ్లిమ్స్ మాత్రమే కావడంతో, పూర్తి సాంగ్ వచ్చిన తర్వాత గానీ పాటపై ఓ అభిప్రాయం రాదు. చిత్రీకరణ గానీ, హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ గానీ, లొకేషన్స్ పరంగా గానీ, “సర్కార్ వారి పాట” ఫస్ట్ సాంగ్ లుక్స్ అదరగొట్టాయి. ఈ ఆల్బమ్ పై థమన్ కూడా భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫుల్ సాంగ్ రిలీజ్ కానుండగా, అప్పటివరకు ఈ గ్లిమ్స్ ను వీక్షిస్తూ ఫ్యాన్స్ ను ఎంజాయ్ చేయమని చిత్ర యూనిట్ చెప్తోంది.