mahesh babu sarkaru vaari paataకొవిడ్ పాండమిక్ తర్వాత పరిశ్రమ సెట్ రైట్ అవడం చాలా కష్టమనిపించింది. ఒక్కొక్కటిగా సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి. పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ సందడి జరిగినా మళ్లీ కొవిడ్ మహమ్మారి వల్ల కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన RRR, కె.జి.ఎఫ్ 2 సినిమాలు సత్తా చాటాయి. ఈ సినిమాలకు ముందు వచ్చిన రాధే శ్యాం మాత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు.

కె.జి.ఎఫ్ 2 తర్వాత వచ్చిన మెగా ఆచార్య బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డది. అంచనాలకు ఏమాత్రం అందుకోని ఆచార్య పరిశ్రమని షాక్ అయ్యేలా చేసింది. అచార్య రిలీజ్ కు ముందు హడావిడి కూడా ఏమంతగా కనిపించలేదు. టికెట్స్ బుకింగ్స్ విషయంలో కూడా మెగా నిరుత్సాహ పరిచారు.ఇక సినిమా చూశాక మరింత నీరసం వచ్చేసింది. దానితో సినిమా మెగాస్టార్ ఖాతాలో డిజాస్టర్ గా నిలిచింది. ఆచార్య తర్వాత రెండు వారాల గ్యాప్ వస్తున్నాడు మహేష్. సర్కారు వారి పాట సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

వరుస విజయలా కారణమో.. లేక మహేష్ మీద నమ్మకమో కానీ సర్కారు వారి పాటకు సూపర్ బజ్ ఏర్పడింది. దానికి తగినట్టుగానే ట్రైలర్ ఇంకాస్త క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఈ క్రమంలో సర్కారు వారి పాటకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హంగామా మొదలు పెట్టారు. సర్కారు వారి పాట జోరు బాగుంది.. ఇదే జోష్ లో సినిమా హిట్ టాక్ వస్తే పరిశ్రమ కోరుకునే మరో సూపర్ హిట్ వచ్చేసినట్టే. కొవిడ్ థర్డ్ వేవ్ తర్వాత పాన్ ఇండియా సినిమాగా కాకుండా కేవలం తెలుగు సినిమాగా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా హిట్ పడితే మళ్లీ ఇండస్ట్రీ పూర్వ వైభవం తెచ్చుకున్నట్టే లెక్క.

ఒకవేళ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఈ మూవీతో అర్ధమవుతుంది. అంతేకాదు ఈ సినిమాకు మిగతా మూవీస్ లానే టికెట్ల రేట్లు పెంచడం జరిగింది. దీనిపై కూడా కొంతమంది ప్రేక్షకుల నుండి అసంతృప్తి వస్తుంది. టికెట్ రేట్లు ఎక్కువని కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ మూవీతో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.