సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ హీరోకు సంబంధించి ఏ చిన్న అంశం వచ్చినా, వాటిని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు.

మరి ప్రస్తుతం ‘సర్కార్ వారి పాట’కు సంబంధించి ఎలాంటి ప్రమోషన్ మెటీరియల్ రిలీజ్ కాకుండానే చేస్తోన్న సందడికి కారణం, ఇది మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ గురించి కాదు, అసెంబ్లీలో జగన్ ఆలపించిన ‘సర్కార్ వారి టికెట్’ గురించి!

పెద్ద సినిమాలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టే విధంగా ఉన్న జగన్ సర్కార్ నిర్ణయం, ఈ ప్రభుత్వం ఉన్నంతవరకు కొనసాగుతుంది. అందుకే “సర్కార్ వారి పాట” సినిమా రిలీజ్ అయ్యే ఏప్రిల్ 1వ తేదీకల్లా ఏకంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేయాలని కొందరు అభిమానులు కోరుకుంటున్నారు.

అంటే అయిదు నెలల్లో అంతా మారిపోవాలన్న మాట! మహేష్ ఫ్యాన్స్ కు మరీ తొందరెక్కువలా అనిపించడం సహజమే! ఒక్క సినిమా కోసమే హీరోల అభిమానులు ఇలా కోరుకుంటుంటే… మరి జగన్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలతో ఏకంగా కొందరి జీవితాలే మారిపోతున్నాయ్..! అందుకే గత కొంతకాలంగా ఏపీ సర్కార్ పై ప్రజావేదన అంతకంతకూ రెట్టింపు అవుతోంది.