సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు లో ఒక ఐటెం సాంగ్ ఉండబోతుంది అనేది చాలా కాలం నుండి మనం వింటున్న మాటే. ఆ పాట లో మిల్కీ బ్యూటీ తమన్నా తన అందాలు ఆరబోస్తుందని, ఆ పాట అప్పుడు జరుగుతుందని, థీమ్ ఇలా ఉండబోతుందనీ రకరకాల వార్తలు మనం చూశాం. అయితే తాజాగా అసలు సినిమాలో అటువంటి పాటకి ఆస్కారమే లేదంటున్నారు.
కానీ సినిమాలోని ఇంట్రడక్షన్ పాటలో ఒక అగ్ర హీరోయిన్ నర్తిస్తుందని సమాచారం. ఐటెం సాంగ్ లేకపోవడం అనే వార్త ఖచ్చితంగా ఫ్యాన్స్ ను నిరాశపరిచేదే. సరిలేరు నీకేవ్వరు షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ తొందరలోనే మొదలు కాబోతుంది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వరుసగా స్టార్ హీరోలందరూ దేవికి మొహం చాటేస్తున్నారు. దానితో ఈ చిత్రం ఆయనకు కీలకం కాబోతుంది. చాలా కాలం తరువాత బండ్ల గణేష్ కూడా నటిస్తున్నారు. బండ్ల గణేష్ చివరి సారిగా 2012లో విడుదలైన బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. అది కూడా మహేష్ బాబు సినిమానే కావడం విశేషం.
NTR Arts: Terrified NTR Fans Can Relax!
SVP Result: A Wakeup Call To Jagan?