Samantha Favourite star ప్రిన్స్ మహేష్ బాబుకు తానూ అభిమానిని, ఇందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు క్షమాపణలు అంటూ… నిర్మొహమాటంగా చెప్పిన సుమంత్ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమయ్యాయి. అది అభిమానులతో చేసిన చిట్ చాట్ కావడంతో… అంతకుమించి చెప్పని సుమంత్, తాజాగా ఇచ్చిన మరొక ఇంటర్వ్యూలో మరింత స్పష్టత ఇచ్చారు. తనకు నచ్చిన నటుడు గురించి చెప్పాల్సిందిగా యాంకర్ ప్రశ్నించినపుడు సూటిగా స్పష్టంగా సమాధానం ఇచ్చాడు సుమంత్.

“మహేష్ కు పోటీయే లేదు, తనవరకు వస్తే నటనలో మహేష్ ను మించిన వారు లేరని, ఇందులో మొహమాటానికి తావు లేదు, ఫ్రాంక్ గా చెప్పేస్తాను మహేష్ తన అభిమాన నటుడని, ఓ పక్కన అఖిల్ ను, చైతన్యను పక్కన పెట్టినా.., మా మావయ్య నాగార్జునను పక్కన పెట్టినా.., అందరినీ పెట్టినా నేను మహేష్ అనే చెప్తాను… అది ఒక్క పవర్ స్టార్ ఉన్నారని చెప్పట్లేదు… వీరందరూ నా దగ్గర ఉన్నా కూడా నేను మహేష్ పేరే చెప్తాను… మొదట్నుండీ నాకు మహేష్ అంటేనే ఇష్టం అని” కుండబద్దలు కొట్టినట్లు… ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చెప్పాడు సుమంత్.

సుమంత్ వ్యాఖ్యలు చూస్తుంటే…. ఒక సెలబ్రిటీ మాదిరి కాకుండా, ఒక సాధారణ మహేష్ అభిమాని ఎలా మాట్లాడతారో అలాగే సుమంత్ మాట్లాడుతున్నారని చెప్పాలి. అందుకే పక్కన నాగ్ ఉన్నా కూడా ప్రిన్స్ పేరే తన నుండి వస్తుందని చెప్పి వివాదాలకు తెరదించాడు. ఒక్క సినిమాల పరంగానే కాకుండా మహేష్ – సుమంత్ లకు వ్యక్తిగతంగా కూడా సాన్నిహిత్య సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. మహేష్ వివాహ సమయంలో వ్యక్తిగతంగా సుమంత్ చాలా సహాయం చేసాడన్న విషయం అభిమానులకు తెలిసిందే.