Mahesh Babu -Bharat -Ane Nenu- I dont know songకొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “భరత్ అనే నేను” నుండి రెండవ సాంగ్ వచ్చేసింది. ‘ఐ డోంట్ నో’ అనే థీమ్ తో సాగిన ఈ పాట రెగ్యులర్ దేవిశ్రీప్రసాద్ బీట్. ఈ తరహా పెప్పీ మ్యూజిక్ తో కూడిన పాటలను దేవి అంతకుముందు చాలానే అందించాడు. అయితే ఈ పాటకున్న స్పెషాలిటీ ఏమిటంటే… బాలీవుడ్ ప్రముఖుడు ఫర్హాన్ అక్తర్ తో పాడించడం. ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా ఉండడంతో ఫర్హాన్ కు కూడా పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు.

ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీని ఇప్పటివరకు ఒక రకమైన మూడ్ లో సాగించగా, ఈ పాటలో ప్రిన్స్ కనిపించిన విధానం అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పడంలో సందేహం లేదు. మహేష్ ను సరికొత్త చూపిస్తూ సాగిన ఈ లిరికల్ వీడియోలో బ్లూ కలర్ పూల టీ షర్టులో మరియు కారులో చేతులు చాస్తూ ఉన్న షాట్స్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అని చెప్పవచ్చు. పాట పరంగా ఎలా ఉన్నా, విజువల్ గా మహేష్ ను కొత్తగా చూడబోతున్నారన్న సంకేతాలు అయితే ఈ పాట ఇచ్చింది.

ఈ పాటకు మరో కోణం చూస్తే… కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా దాదాపుగా ఇదే రీతిలో ఉంటుంది. అప్పటివరకు కనిపించిన ప్రభాస్ ను పూర్తిగా మార్చేసి, సరికొత్తగా ప్రజెంట్ చేసారు కొరటాల. బహుశా అదే టాస్క్ ను మళ్ళీ మహేష్ విషయంలో కూడా పునరావృతం చేయబోతున్నట్లుగా కనపడుతోంది. ఏది ఏమైనా సరికొత్తగా ప్రిన్స్ దర్శనమిస్తుండడంతో, ఫ్యాన్స్ ఫిదా కావడం సహజం! బాబు స్క్రీన్ ప్రజెన్స్ అలాంటిది మరి!