mahesh babu redefined adoption of villages,burripalemఆంధ్రప్రదేశ్ లో దత్తత తీసుకున్న తన తండ్రి సొంత ఊరు గుంటూరు జిల్లా, బుర్రిపాలెం గ్రామంలో ఇప్పటివరకు ప్రిన్స్ మహేష్ బాబు అడుగుపెట్టలేదు. ఇటీవల ప్రిన్స్ సతీమణి మరియు సోదరిలు కలిసి గ్రామంలో పర్యటించి, త్వరలోనే మహేష్ బాబు వస్తారని మాటిచ్చి వచ్చారు. దీంతో ఆ మాటను నిలబెట్టి బుర్రిపాలెం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రిన్స్ విచ్చేయనున్నారన్న సమాచారం గ్రామస్తుల్లో ఫుల్ జోష్ ని నింపుతోంది.

మే 8వ తేదీన వచ్చే ఆదివారం నాడు ప్రిన్స్ బుర్రిపాలెంలో పర్యటించనున్నారని షెడ్యూల్ ఖరారైంది. 7వ తేదీన ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుక జరిగిన మీదట, 8వ తేదీనాడు బుర్రిపాలెంలో ఆంధ్రా హాస్పిటల్స్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్న ఉచిత వైద్య శిభిరంలో ప్రిన్స్ పాల్గొనబోతున్నారు. అలాగే గ్రామంలోని ప్రతి కుటుంబానికి మహేష్ బాబు చేతుల మీదుగా హెల్త్ కార్డులు అందజేయనున్నారు.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే విధంగా ముందుగా గ్రామస్తుల ఆరోగ్యంపై ప్రిన్స్ దృష్టి సారించడం… దత్తత అన్న పదానికి మరో నిర్వచనం చాటిచెప్పేలా ప్రిన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతోంది. బహుశా ‘శ్రీమంతుడు’ సినిమా సన్నివేశాలను తన నిజజీవితంలో కూడా ప్రిన్స్ రిపీట్ చేసేలా కనపడుతున్నారని అభిమానులు సందడి చేస్తున్నారు.