Mahesh -Babu -మీకో విషయం తెలుసా? త్వరలోనే ప్రిన్స్ మహేష్ బాబుతో, మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి సినిమా చెయ్యనున్నాడట. అయితే ఈ సినిమాతో ఒక్క దెబ్బతోనే మహేష్ ని ఏకంగా బాలీవుడ్ కి పరిచయం చెయ్యడానికి రాజమౌళి తెగ ప్ల్యాన్స్ చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమానె ఇండస్ట్రీ హిట్ అట. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న సినిమా గాసిప్స్ లో అత్యంత సిల్లీ గాసిప్. అసలు రాజమౌళి ఏంటి మహేష్ తో సినిమా ఏంటి? పైగా హిందీలో ఏంటి? కాస్త వాడండి అయ్యా..

ఒక పక్క మహేష్ ‘భరత్ అను నేను” బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా అదిగో ఇదిగో అంటూ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే వేశవికి రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రిన్స్ ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యనున్నాడు అని టాలీవుడ్ సినిమా సర్కిల్స్ నుంచి కాస్త బలంగానే వినిపిస్తున్న వార్త. ఇక మరో పక్క మన జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది నిన్ననే అటు టాలీవుడ్ టాప్ హీరోస్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరితో “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ మొదలు పెట్టేశాడు. అదిగో ఇదిగో అంటూ ఒక రెండు ఏళ్లు ఇదే షూటింగ్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అసలు ఈ సినిమానె ఎప్పుడు రిలీజ్ అన్నది ఇంకా క్లారిటీనే లేదు. ఈ క్రమంలో

అటు ప్రిన్స్, ఇటు రాజమౌళి, ఇద్దరూ మరో ఒకటి, రెండు ఏళ్ల వరకూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న సమయంలో అసలు వీళ్ళిద్దరూ సినిమా చెయ్యనున్నారు అని ఎవరో చెప్పడం, అదీ బాలీవుడ్ కి ప్రిన్స్ కి పరిచయం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు రాయడం ఏదైతే ఉందో “కంటెంట్ తక్కువై, కామెడీ ఎక్కువైన” సినిమాలా ఉంది అని నవ్వుకోవాల్సిందే తప్ప, నమ్మితే మాత్రం పూర్తిగా మోసపోయినట్లే.