bhale_manchi_roju_audio_launch-maheshbabu-sudheer babuసుధీర్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘భలే మంచి రోజు’ చిత్రం ఆడియోను నిన్న వైభవంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్‌బాబు హాజరయ్యి ఆడియోను ఆవిష్కరించాడు. ఈ సందర్బంగా బావ సుధీర్‌బాబుపై తనకు ఉన్న నమ్మకంను, అభిమానంను చెప్పుకొచ్చాడు. సుధీర్‌బాబుకు కెరీర్‌లో ఒక్క మంచి కమర్షియల్‌ హిట్‌ పడితే స్టార్‌ అవ్వడం ఖాయం అని, ఆ సూపర్‌ హిట్‌ కోసం ఎదురు చూడాలని అన్నాడు.

సుధీర్‌బాబులో కష్టపడే తత్వం తనకు బాగా నచ్చుతుందని, ఏదైనా చేయాలని అనుకుంటే దాన్ని చేసే వరకు వదిలి పెట్టడు అని, ప్రతి పనిని కూడా డెడికేషన్‌తో సుధీర్‌బాబు చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. సుధీర్‌ను హీరోగా ఆధరిస్తున్న ప్రేక్షకులకు ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు, ‘భలే మంచి రోజు’ టీజర్‌ చూసినప్పుడే కొత్తగా అనిపించి ఆకట్టుకుంది అని అన్నాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకు మంచి వర్క్‌ను అందించాడని ట్రైలర్‌ను చూస్తే అనిపిస్తోందని మహేష్‌బాబు అన్నాడు. మరి మహేష్‌బాబు అన్నట్లుగా ఈ సినిమా మంచి సక్సెస్‌ అయ్యి సుధీర్‌ స్టార్‌ అవుతాడో చూడాలి.