Mahesh Babu Praises Arjun Reddy Movieప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తోన్న “అర్జున్ రెడ్డి” సినిమాపై విమర్శకులతో పాటు సినీ ప్రముఖులందరూ ఒక్కొక్కరిగా ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా చేరిపోయిన విషయం తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై, ఈ చిత్రంలో నటించిన హీరో విజయ్ దేవరకొండపై మరియు దర్శకుడు సందీప్ రెడ్డిపై వరుసగా మహేష్ బాబు ట్వీట్లు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

తనకు నచ్చిన సినిమాల గురించి నిర్మొహమాటంగా ప్రశంసించడం ప్రిన్స్ ఎప్పుడూ చేసే విషయమే అయినా, ‘అర్జున్ రెడ్డి’ విషయంలో మాత్రం ఇంకాస్త ఉత్సాహం చూపించారనే చెప్పాలి. అయితే మహేష్ బాబు నుండి ఊహించని ఈ ట్వీట్ల సందేశంలో చిత్ర హీరో మరియు యూనిట్ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. ముఖ్యంగా తన అభిమాన హీరో నుండి ఈ రకమైన ప్రశంసలతో లభించడం విజయ్ ఊహించని విషయమేమో!

గతంలో పలు ఇంటర్వ్యూలలో తన అభిమాన హీరో మహేష్ బాబు అని, కాలేజీ రోజుల నుండి ఫాలో అవుతున్నానని విజయ్ దేవరకొండ చెప్పిన సంగతి సినీ విజ్ఞులకు విదితమే. ఇప్పుడు అదే మహేష్ నుండి ప్రశంసలు లభించడం అనేది ఎవరికైనా చెప్పుకోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అందుకే “ఇప్పటివరకు దిమ్మతిరిగిన బాక్సాఫీస్, ఇక బద్దలైపోవాలి” అంటూ ప్రిన్స్ కు రిప్లై ఇచ్చాడు విజయ్.