Mahesh-Babuతనకు నచ్చిన చిత్రాలపై ప్రశంసలు కురిపించడంలో సిద్దహస్తుడిగా మారుతోన్న మహేష్ బాబు నుండి తాజాగా “అభిమన్యుడు” సినిమాపై ట్వీట్ వచ్చింది. ‘అభిమన్యుడు సినిమాతో తాను చాలా ఇంప్రెస్ అయ్యానని, దర్శకుడు మితరన్ విజన్ అండ్ దర్శకత్వ ప్రతిభను బాగా చాటారని, పరిశోధించి చేసిన ఈ సినిమా చాలా ఫాస్ట్ గా ఉందని ప్రశంసించారు.

ఈ సందర్భంగా విశాల్ కు మరియు చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపగా, ఈ ట్వీట్ కు దర్శకుడు మితరన్ స్పందించారు. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి ఇలాంటి ట్వీట్ రావడం నేను ఊహించుకున్న ఉదయం కాదని, మీ మాటలకు, ప్రోత్సాహలకు ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ కు రిప్లై ఇచ్చారు. మొత్తానికి మహేష్ ను కూడా పడేయడంలో ఈ యువ దర్శకుడు సక్సెస్ అయినట్లే!